జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 29రిపోర్టర్ సలికినీడి నాగు మేదస్సు, జ్ఞానం, పరిపాలనా దక్షత, బహుభాషా కోవిదత్వంతో రాజకీయ రంగంలో తాను అలంకరించిన ప్రతి పదవికి ఠీవీ తెచ్చిన ఘనుడు మన తెలుగు బిడ్డ పివి అని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు. భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్టినాగాంజనేయులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా తొలుత పివి చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రగళ్ల రవి రెడ్డెం నర్సిరెడ్డి బ్రాహ్మణ సంఘం యువ నాయకులు రామచంద్రుల విక్రమాదిత్య పూలమాలలు వేసి ఘనంగా జయంతి జేజేలు పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షాల అసమర్ధ పాలన కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశ ఆర్థిక నావకు తాను దిక్సూచిగా నిలిచి విజయ తీరాలకు చేర్చిన ఘనుడు పీవీ నరసింహారావు అని అన్నారు ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండింటిని పరుగులు పెట్టించడం ద్వారా దేశ ఆర్ధిక స్థితిని దుస్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చిన దిక్సూచి పీవీ నరసింహారావు అని అన్నారు నేడు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా సంపన్న దేశాలుగా పిలువబడిన దేశాలు కూడా ఆర్థిక మంత్రి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారతదేశం నేడు ఆర్థికంగా సుస్థిరంగా ఉన్నదంటే కారణం పీవీ నరసింహారావేనని వేనోళ్ళ కొనియాడారు ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రములో నవశకానికి శ్రీకారం చుట్టిన పీవీ నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక రంగ చరిత్రలో సువర్ణాక్షర లిఖిత స్థానాన్ని సంపాదించారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ విభాగం కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవానీ వెంకటేష్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు గుంటూరు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయులు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరగళ్ల రవి, రెడ్డెం నర్సిరెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె పోగు రాజు కోవూరు రాజా ఉప్పాల బాబు పెదలంక వెంకటేశ్వర్లు ఎప్పాల అంజిరెడ్డి పుల్లగూర పరదేశి టి ఎలిజబెత్ రాణి టి వెంకట్రావు టి చంద్రశేఖర రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.