జనం న్యూస్ జూన్ 29 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 21వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని దేవాలయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.