జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధి : కాట్రేని కొన లో ఆదివారం 123వ మన్‌కీ బాత్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు వీక్షించారు. కాట్రేను కొన, ఒకటో వార్డులో ట్రెజరర్ తన ఆఫీసియందు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపట్టిన మన్‌కీ బాత్ కార్యక్రమం 123వ ఎపిసోడ్ కావటం గర్వంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్ట శివకుమార్, పూర్వపు అధ్యక్షులు మట్ట సూరిబాబు సెక్రటరీ కొత్తలంక సురేష్ ప్రసాద్ గ్రంధి సురేష్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.