జనం న్యూస్- జూన్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగమ్మ గుండె శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని నాగార్జునసాగర్ టౌన్ కాంగ్రెస్ నాయకులను నాగమ్మ ఇంటికి పంపించి, వారి ద్వారా ఫోన్లో పరామర్శించి నాగమ్మ యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఆపదలో ఉన్న కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి నాగమ్మ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలను జానారెడ్డి కుటుంబం ఎప్పటికీ మరువదని తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగమ్మను పరామర్శించిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఉంగరాల శ్రీనివాస్, నరసింహారావు (చిన్ని), జనార్ధన్, బాలాజీ నాయక్, మాయ కోటి శంకర్, ఎర్రబోయిన సురేష్ తదితరులు ఉన్నారు.