ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మార్కాపూర్ పట్టణ 11వ బ్లాక్ ఇన్చార్జ్, యువ నాయకుడు మల్లాపురం ఉత్తమ్ కుమార్ నియమితులైనట్లు వైసిపి కేంద్ర కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు వెలుపడ్డాయి.ఈ సందర్భంగా మల్లాపురం ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పదవి రావడానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే లు అన్నా రాంబాబు, జంకే వెంకటరెడ్డి, కుందూరు నాగార్జున రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ అభివృద్ధికి తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని ఉత్తమ్ కుమార్ తెలిపారు.