జనంన్యూస్. 30.నిజామాబాదు. టౌన్.
నిజామాబాద్ పోలీస్ శాఖలో జూన్ 30 న "పదవి విరమణ*" నేపద్యంలోని వారి వివరాలు
జూన్ నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది
కే.పోచయ్య హెడ్ కానిస్టేబుల్ *1478 ముగ్పాల్ పోలీస్ స్టేషన్, మొత్తం సర్వీస్:34 సంవత్సరాలు
పదవి విరమణ " వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి" పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , నిజామాబాదు సౌత్ రూరల్ CI శ్రీ సురేష్ కుమార్, ముగ్పాల్ SI శ్రీ సి. యాదగిరి గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి ( వెల్ఫేర్ ) .శ్రీనివాస్ ( అడ్మిన్ ) , మరియు వారి కుటుంబ సభ్యులు హజరు కావడం జరిగింది.