జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :-
బాలికల సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ అన్నారు.
శుక్రవారం బాలికా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా బాలికల ఉన్నతి కోసం సమిష్టి చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. బాలికల రక్షణకు హెల్ట్పైన్ నెంబర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు.