జనం న్యూస్- జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో వార్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ సోమవారంతో ఉద్యోగ విరమణ పొందిన మహమ్మద్ నిరంజన్ ను రెవెన్యూ, మున్సిపల్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ సందర్భముగా నందికొండ మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెద్దవూర తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నిరంజన్ తన సర్వీసులో ఎక్కువ కాలం రెవెన్యూ శాఖకు సేవలందించారని, నందికొండ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ తాను పనిచేసిన రెవెన్యూ, మున్సిపల్ శాఖలో విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనంతరం నందికొండ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్లు,సిబ్బంది ఆధ్వర్యంలో మహమ్మద్ నిరంజన్ ఫాతిమా బేగం దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దవూర తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దండ శ్రీనివాస్ రెడ్డి, హబీబ్ లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు విజయకుమార్, అర్చన, డి.శ్రీనివాస్, జెన్నమల్లు, కే బాలాజీ,రమేష్, మహమ్మద్ సయ్యద్, కె సంధ్య,కళ్యాణి,సైదారావు, మల్లేష్, పెంచలయ్య, మరియు నిరంజన్ కుటుంబ సభ్యులు,మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.