జనం న్యూస్ - జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గురులింగం,సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించి బదిలీపై నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ గా వచ్చారు. గతంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన దండు శ్రీనివాస్ చిట్యాల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.నూతన మున్సిపల్ కమిషనర్ గా ఈరోజు కార్యాలయానికి వచ్చిన యు గురు లింగం ను మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ లు విజయకుమార్, అర్చన, డి శ్రీనివాస్, మహేష్ మున్సిపల్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.