సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్.
జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కాగజ్ నగర్ పట్టణ ములో వివిధ పిఎహెచ్ సి లలో నౌగాం బస్తి. సర్ సిల్క్. భట్టుపల్లి నజురోల్ నగర్.ఆయా వైద్యాధికారులకు జూలై 9 సార్వత్రిక సమ్మె నోటీసులు ఇచ్చిన సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ శతాబ్ది కాలం నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి, కొన్నింటినీ రద్దుచేసి యజమానులకు అనుకూలంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం తీసు కొస్తున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని కోరుతూ జూలై 9 జరిగే సమ్మెలోజిల్లా లోని ఆశ వర్కర్స్ ఇతర కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపు నిచ్చారు. మే 20 న దేశ వ్యాప్త సమ్మేకు కార్మిక సంఘా లు పిలుపునిచ్చాయని, అయితే దేశంలో పహల్గాంలో ఉగ్రవా దులు కాల్పులకు తెగబడి అమాయకపు ప్రజల ప్రాణాలు బలిగొనడంతో ఆ తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో జూలై 9 సమ్మే వాయిదా వేసుకోవడం జరిగిందన్నారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించడం, సంఘం పెట్టుకొని సంఘటితంగా పోరాడే రాజ్యాంగవు హక్కును కాదనడం తదితర అనేక కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త కార్మిక కర్షక జాతీయ సమ్మెలో కొమురం భీమ్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని కోరారు. ప్రభుత్వాల విధా నాల వల్ల కార్మికులకు రైతులకు ప్రజలకు నష్టం కలిగిస్తే ఉద్యమించడమే మార్గం తప్ప మరొకటి లేదని తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడి దారులకు పారి శ్రామికవేత్తలకు రుణ మాఫీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు 24 గంటల పాటు వైద్య సదుపాయాలు ప్రజలకు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అనేక సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సౌకర్యాలు అందిస్తున్న ఆశలను కార్మికులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక కర్షక సమ్మెతో నైనా ప్రభుత్వాలు దిగివచ్చి కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచశీల. భాగ్యలక్ష్మి.సురేఖ. సరోజ. కేసరి.వనిత.లక్ష్మి .జమీల. శైనాజీ. తదితరులు పాల్గొన్నారు