జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కార్మికులను తగ్గించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవలని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ నుండి మున్సిపల్ గా ఏర్పడి 16 నెలలు పూర్తి అవుతుంది ఈ మధ్యకాలంలో కార్మికులందరికీ జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని ధపాల వారీగా ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా జిల్లా అధికారులతో పాటు గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు కూడా ఉన్న కార్మికులందరినీ యధావిధిగా జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లిస్తామని స్పష్టంగా చెప్పారు ఇతర మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉన్న సౌకర్యాన్ని అన్ని ఆసిఫాబాద్ మున్సిపల్ లో పనిచేసే కార్మికులందరికీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కానీ దీని విరుద్ధంగా అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు కొంతమంది కార్మికులను గ్రామపంచాయతీకి పంపిస్తామని చెప్తా ఉన్నారు కార్మికుల కడుపు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అధికారులు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడకపోతే కచ్చితంగా కార్మికుల అందరం కలిసి పోరాటాన్ని మరింత చేస్తామని తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్ల రాజయ్య తోట సమ్మయ్య గౌరాధ్యక్షుడు పేరక శ్రీకాంత్ నగేష్ మహేందర్ ప్రవీణ్ దగ్గర మల్లేష్ *దుర్గాప్రసాద్ అశోక్ ప్రభాకర్ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు