జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
చెట్లు ప్రగతికి మెట్లు అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో. కార్యాలయంతో పాటు క్రీడ పాఠశాలల్లో ఆవరణలో చేపట్టిన వన్ మహోత్సవం కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి. డీటీడీవో రమాదేవి. తహసీల్దార్ రియాజ్ అలీ. ఇతర అధికారులతో కలిసి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలని కలెక్టర్ కోరారు.