(జనం న్యూస్ చంటి జులై.1)
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు క్రమశిక్షణగా మెదగాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్లో అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాట్ నెక్స్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు.అనంతరం విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీ కళాశాల ప్రిన్సిపుల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్లు చూస్తున్నారని అన్నారు అవసరమున్నప్పుడే తప్ప ఫోన్ వాడాలి కానీ ఎప్పుడు ఫోన్ వాడకూడదని అన్నారు.అంతేకాకుండా గుట్కాలు పాన్ మసాలా లాంటి నీ అలవాటు చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. కష్టపడి చదివి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి కూడా వెళ్ళవచ్చు అని అన్నారు. అనావసరమైన వాటికి ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు.విద్యార్థులు కళాశాలలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్పుడప్పుడు వారి నడవడికను గమనించాలని అన్నారు.ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల రాజ్ ఫౌండేషన్ అధినేత కూకట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ,ప్రముఖ వ్యాపార వేత్త చింత రాజు,నల్ల శ్రీనివాస్,అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు ఇనుప రవి, జోగు సాగర్,, మహేష్, అందె ప్రవీణ్, అందె శ్రీనివాస్, అస్కె స్వామి, అల్లిబిల్లి కుమార్, బొల్లం రాజేష్ భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.