జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రభుత్వ వైద్యశాలలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం సమాజానికి వైద్యులు అందించే సేవలను గౌరవించడం మరియు గుర్తించడం ఈ దినోత్సవ లక్ష్యం* జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నందలూరు మండల ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల అధికారి డాక్టర్ శరత్ ను శాలువాతో సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి వైద్య సిబ్బందికి మరియు రోగులకు పంచారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్య నారాయణ మాట్లాడుతూ వైద్యులు మరియు వైద్య నిపుణులు అద్భుతమైన కృషిని గౌరవించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారని. జాతీయ వైద్యుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత సమాజానికి వైద్యులు అందించే సేవలను గౌరవించడం మరియు గుర్తించడం ఈ దినోత్సవ లక్ష్యం అని వైద్య రంగంలో సాధించిన విజయాలు మరియు పురోగతులను జరుపుకోవడానికి మరియు యువకులు వైద్య వృత్తిలో వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక రోజుని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనుకుర్తి వెంకటయ్య,షేక్ మౌలా,మట్టి బాబు పఠాన్ మెహర్ ఖాన్, చుక్క కొండయ్య,శివ నరసింహులు వైద్య సిబ్బందిశైలజ.సునీల్. పద్మావతి ఆరీఫ్.ఈగ మధు సుధన్ రెడ్డి ఖాదరబాషా తదితరులు పాల్గొన్నారు,