జనం న్యూస్ జులై 2 :-
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామానికి చెందిన బోడంపాటి యూసఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ల అమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడు ఉప్పరి రాకేష్ వారి అంత్యక్రియల కొరకై ఆర్థిక సహాయంగా 4000 రూపాయలు వారి అంత్యక్రియలకు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి మనోధర్యం చెబుతూ ఏ సమస్య వచ్చినా మేమున్నామని మన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మనందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడని వారికి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఈ అనిల్, కలీం, గండు జంగయ్య, కంచి రామచంద్రయ్య, కౌసర్, గ్రామ కారోబార్ ఈ జంగయ్య, హబీబ్ తదితరులు పాల్గొనడం జరిగింది.