జనం న్యూస్,జూలై02,అచ్యుతాపురం:ఏడాది
పాలనలో సాధించిన విజయాలపై చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అందులో భాగంగానే అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పల్లిపేట గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి పోన్నమళ్ళ కొండబాబు అద్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు..గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను 'మై టీడీపీ' యాప్‌లో నమోదు చేశారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 'తల్లికి వందనం' అమలు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తుందని, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నమ్మల్లు,లోవరాజు,పొన్నమల్ల రాజు, సూరిబాబు,బొంగు నాగరాజు,రాంబాబు,ప్రసాద్,పొన్నమల్ల తాతాజీ, ప్రకాష్,అర్దాల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.