జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి.
ప్రారంభించిన పోలీస్ కమీషనర్
పాల్గొన్న నిజామాబాద్ , జగిత్యాల్ , నిర్మల్ , అదిలాబాద్ పోలీస్ సిబ్బంది*
పోలీస్ విధినిర్వహణలో సామర్ధ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో కార్యాలయంలో *జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ - 2025 కార్యాక్రమం ( నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ c జిల్లాలు) పోలీస్ డిపార్ట్మెంట్ లో పోటీలు నిర్వహించినారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సి.ఐ స్థాయి వరకు పనిపద్దతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి , పనిలో పోటీతత్వం అలవాటుపడు తుంది. సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్ , ఫారంసిక్ , ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో నేరాలు జరిగినప్పుడు అట్టి నేరస్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం “ పోలీస్ క్లూస్ " ఏ విధంగా సేకరించాల అనేదాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ హెడ్‌కార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యలయం, పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. సమక్షంలో సి.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో సైంటి ఫిక్ ఎయిడ్స్ టూ ఇన్వెస్టగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్ , ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ ఫ్లోజింగ్ ,నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ , తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించడం జరిగింది.ఈ ఎంపికలు మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, IPS,. గారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్‌ను ఇన్వెస్టిగేషన్ టూల్ గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపరుచుకుని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ .ఆర్ ) శ్రీ రామ్ చందర్ రావ్, సి.సి.ఎస్. ఎ.సి.పిశ్రీ నాగవేంద్ర చారీ, మరియు జగిత్యాల్ , నిజామాబాద్ , నిర్మల్ , అదిలాబాద్ సి.ఐల ఎ,ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.