జనం న్యూస్,జూలై02,అచ్యుతాపురం:
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండల యువజన అధ్యక్షులు దూళి వెంకీ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దృష్టికి రాంబిల్లి మండలంలో ఉన్న పలు సమస్యలను మండల యువజన అధ్యక్షులు దూళి వెంకీ తెలియజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ యువజన అధ్యక్షులు సియాద్రి బుజ్జి, అచ్యుతాపురం మండల యువజన అధ్యక్షులు కారుకొండ శ్రీను గంగోలి తదితరులు పాల్గొన్నారు.