జనం న్యూస్ జూలై 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
అర్హులైన లబ్ధిదారులందరూ సంక్షేమ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మునగాల మండల ఎంపీడీవో రమేశ్ దిన్ దయాళ్ అన్నారు. బుధవారం మండలం పరిధిలోని కలకోవ గ్రామం లో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆద్వర్యం లో,ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ను అర్హులైన ప్రతి ఒక్కరు తీసుకొవాలని కోరారు. మండల అభివృద్ధి కార్యాలయం లో ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి, ప్రజలకు సౌకర్యవంతంగా అధికారులు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. గృహ జ్యోతి, ఉచిత గ్యాస్ సిలెండర్ కు దరఖాస్తు, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రెండవ ధప అవకాశం ప్రభుత్వమే కల్పిస్తున్నదని తెలిపారు.ప్రజా పాలన దరఖాస్తు దారులు ఇప్పటికీ ఏమైనా పథకం అందకపోతే, తిరిగి మండల అభివృధి కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్, సారధి కళాకారులు పాలకుర్తి శ్రీకాంత్,పల్లెల రాము,గంట భిక్ష పతి,గడ్డం ఉదయ్,పాక ఉపేందర్,కుందమల్ల నాగలక్ష్మి, గజ్జి మంజుల,సిరిపంగి రాధ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.