కురిమెల్ల శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు
జనం న్యూస్ 02జులై (కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రైవేటు కాలేజీలలో మరియు పాఠశాలల్లో యందు విద్యా హక్కు చట్టం ప్రకారంగా 25 శాతం సీట్లని ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇవ్వాలని చట్టం చెబుతున్న ప్రైవేటు యాజమాన్యం అట్టి విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తల్లిదండ్రుల శ్రమను దోచుకుంటున్నారని కొత్తగూడెం నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ తీవ్రంగా ఆరోపించారు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం ఫీజులు పెంచుతూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరగ గొడుతున్నారు వారి స్కూల్లో ఏందే మెటీరియల్ పేరు తోటి యూనిఫార్మ్స్ పేరుతోటి వేలాది రూపాయలు కూడా పెట్టుకుంటున్నారని ఈ దుర్మార్గపు చర్యలపై జిల్లా విద్యాధికారులు మరియు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుచున్నది లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు