ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 25 (జనం న్యూస్):- గిద్దలూరు :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులుగా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి నియమితులైనట్లు వైసిపి కేంద్ర కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా బొల్లా బాలిరెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పదవి రావడానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, వైసిపి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కి, మరియు బేస్తవారిపేట మండల ఎంపీపీ ఓసూర రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ అభివృద్ధికి తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని బొల్లా బాలిరెడ్డి తెలిపారు.