జనం న్యూస్ జులై 2 నడిగూడెం
జులై 9న జరిగే గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు కోరట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమ్మెను విజయవంతం చేయటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.