జనం న్యూస్ కాట్రేనికోన, జూలై 2
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబం కార్యక్రమం ఇటీవల చెయ్యరు గ్రామంలో నిర్వహించిన సంగతి తెలిసిందే, ఈ కార్యక్రమంలో భాగంగా అదే గ్రామానికి చెందిన మడికి లక్ష్మి కుటుంబాన్ని త్సవటపల్లి నాగేంద్ర (నాగు) దత్తత తీసుకోవటం జరిగినది. వారి పిల్లలకి చదువు నిమిత్తం కావలసిన బుక్స్, కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర (నాగు)మాట్లాడుతూ మీరు బాగా చదవాలని, మీ భవిష్యత్తు కోసం నేను మీకు అండగా ఉంటాననీ ఆ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు హై స్కూల్ విద్యార్థులకు 25 వేల రూపాయలతో నోటు పుస్తకాలు, వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే చెయ్యేరు ప్రాథమిక పాఠశాల కు మినరల్ వాటర్ సంవత్సరానికి 60 వేల రూపాయలు ఖర్చుతో ప్రతిరోజు మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్న దాత త్సవటపల్లి నాగేంద్రను పలువురు గ్రామస్తులు అభినందించారు .స్థానిక సర్పంచ్ చెల్లి సురేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా మండల టిడిపి అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు,ఎంపిడి.ఓ. ఎస్. వెంకటాచలం,తహసిల్దార్ సుబ్బలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ పోలిశెట్టి వెంకటరాజు, ఎంపీటీసీ సభ్యులు గుత్తుల సూర్య మహాలక్ష్మి, త్సవటపల్లి .బి.వి.వి నారాయణస్వామి,నంద్యాల వెంకన్న బాబు, గిడ్డి చంటి, నామ వెర్రి బాబు,త్సవటపల్లి హర్ష, ఎంపీటీసీ ఉచ్చుల ఆదిలక్ష్మి నారాయణ,బొక్క శ్రీనివాస్, గాలిపల్లి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది ,తది తరులు పాల్గొన్నారు.