జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కార్మిక హక్కులను, చట్టాలను కాపాడుకోవడం కోసం జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ పిలుపునిచ్చారు. బుధవారం ఎల్పీజీ భవన్లో ఆశ వర్కర్ల సమావేశం జరిగింది. జులై 9న దేశవ్యాప్త సమ్మె జరుగుతుందన్నారు. సమ్మెలో ఆశావర్కర్లు పాల్గొని జయప్రదంచేయాలన్నారు. నాలుగు లేబర్ కోళ్ల రద్దు చేయాలని, ఆశా వర్కర్లు కార్మికులుగా గుర్తించాలన్నారు.