(జనం న్యూస్ 3 జూలై భీమారం మండల ప్రతినిధి కాసి రవి)
ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ యూనీఫాం ఉచితంగా అందించడం మధ్యాహ్నభోజనం, రాగి జావ పంపిణీ దృశ్య శ్రవ్య పరికరాలు ద్వారా విద్యాబోధన వంటివి పిల్లలకు తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఇస్తే బి.సి,యస్.సి.సంక్షేమ వసతిగృహలు వంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉండడంతో తమ పిల్లలను సర్కారు బడి బాట ను పట్టిస్తున్నారు