బిచ్కుంద జులై 3 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కార్యాలయం ముందర నల్ల బ్యాడ్జితో ఏఎంసి సెక్రెటరీ ఆధ్వర్యంలో సిబ్బందితో నిరసన తెలిపారు.
బుధవారం నాడు మహబూబ్నగర్లో ఏఎంసి సెక్రెటరీ భాస్కర్ పై ఏఎంసి వైస్ చైర్మన్ దాడి చేయడం హేళనమైన చర్య అని అలాగే ఏదైనా సమస్య ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు కలిసి చర్చించి సమస్యను పరిష్కరించాలి గాని ఇలా దాడి చేయడం యావత్ తెలంగాణ ఏఎంసి సెక్రెటరీ అవమానపరచడమే అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయం ఉద్యోగ సిబ్బంది నిరసన తెలుపడం జరుగుతుందని మళ్లీ ఇలాంటి దాడి గానీ చర్య గాని జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లాలు, రవి , గౌతమ్ ,సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.