జనం న్యూస్,జూలై 03,అచ్యుతాపురం:
కల్తీ మద్యం తయారీదారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్యుతాపురం ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో కల్తీ మద్యం నిర్వహిస్తున్నారని, నాసిరకమైన మద్యాన్ని, స్పిరిట్‌ను తీసుకొచ్చి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయని, ముందు మత్తు పదార్థాలను రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి,మందు వంటి మత్తు పదార్థాలపై నిషేధించాలని కోరారు. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ అక్రమ కల్తీ మద్యం వలన అనేకమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం స్పిరిట్ తయారు ఇలాంటి సంఘటనపై కఠినంగా చర్యలు ఉండాలని, బెల్ట్ షాపులు అమ్మకాలు జరుపుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కల్తీ మద్యం తయారీదారులు వెనక ఉన్న వారిపై కూడా చర్యలు ఉండాలని కోరారు. బెల్ట్ షాప్ లు అరికట్టి మద్యం తయారీదారుల పై చర్యలు తీసుకోవాలని,
కల్తీ మద్యంపై సమగ్ర విచారణ చేయాల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు త్రిమూర్తులమ్మ, కాసులమ్మ ,మండల అధ్యక్షురాలు నారాయణమ్మ పాల్గొన్నారు.