జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజీలేని సమరశీల పోరాటాలు యుటిఎఫ్ ( యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) కే సాధ్యమని నందలూరు యుటిఎఫ్ నాయకులుహరినాథ్ ,రమేష్, కృపానందం, సుధాకర్, శామ్యూల్ ,పేర్కొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో బదిలీ పై వెళ్లిన యూ టి ఎఫ్ సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం స్థానిక నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సన్మాన గ్రహీతలు షేక్ రౌఫ్ బాష, మస్తాన్ రెడ్డి,విశ్వనాధ్, వరప్రసాద్, మాట్లాడుతూ యుటిఎఫ్ నాటినుండి నేటి వరకు విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని సమరశీల పోరాటాలను నిర్వ హిస్తున్నదన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా, ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నదన్నారు. యుటిఎఫ్ కేవలం ఉపాధ్యాయుల సమస్యలకే పరిమితం కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో సైతం పాలుపంచు కుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఏం.శ్రీనివాసులు యుటిఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలు రజనీ కమిటీ సభ్యులు ఇమామ్ భాష ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డన్న.కిరణ్ బాబు, వేంకటేశ్వర గౌడ్,తదితరులు పాల్గొన్నారు.