జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ
ఎంపీడీవో పణీ చంద్ర లకు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ 1995 వ సంవత్సరంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు లక్షల సొంత రూపాయలతో బస్టాండ్ నిర్మించినామని
20 23 వ సంవత్సరంలో రోడ్డు వెడల్పు లో భాగంగా బస్టాండ్ ను తొలగించాలని అప్పటి అధికారులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ని కోరామని మేం భవిష్యత్తులో ఈ స్థలంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేసుకుంటామని చెప్పడంతో మీకు అనుమతి ఇప్పించే బాధ్యత మాదే అని వారు ఒప్పుకున్నారని దానిలో భాగంగానే బస్టాండ్ తొలగించామని అన్నారు అట్టి స్థలంలో ఇతరులకు ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వకూడదు తెలిపారు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ అనుమతికి వెంటనే ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు పత్తి శీను, బూర లక్ష్మీనారాయణ, తుమ్మ ప్రభాకర్, మామిడి మారుతి, గొట్టిముక్కుల రమేష్, బత్తుల శ్రీధర్, బాసని లక్షణామూర్తి, తదితరులు పాల్గొన్నారు…..