జనం న్యూస్ జూలై 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే,ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా. గురువారం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం,బరాకత్ గూడెం గ్రామాలలోని ఆసక్తి గల 125 మంది రైతుల పొలాల నుండి మట్టి నమూనాలు సేకరించడం జరిగిందని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు.ఈ రైతులకు ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, మెళుకువలు గురించి కేవీకే గడ్డిపల్లిలో రెండుసార్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.రెండు సంవత్సరాల తర్వాత ఈ రైతులకు ప్రకృతి వ్యవసాయ సర్టిఫికెట్ కూడా ప్రభుత్వంచే ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ మట్టి మూలా సేకరణ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రేష్మ, నాగు,రమ్య, భవాని పాల్గొన్నారు.