క్షయవ్యాధిని అరికట్టవచ్చు
సరైన సమయంలో క్షయవ్యాధి లక్షణాలను గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు.
జనం న్యూస్ జూలై 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
సరైన సమయంలో క్షయవ్యాధి లక్షణాలను గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని,సమాజంలో క్షయవ్యాధి నివారణకు అందరు కృషి చేయడంతో పాటు వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని.రేపాల ప్రాథమిక వైద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు.గురువారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు నిర్వహించినట్లు డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు.ఈ క్యాంపులో ఎక్స్ రే ద్వారా 100 మందికి పరీక్షలు నిర్వహించామని,38 మంది నుండి కళ్ళే సేకరించి పరీక్షల కోసం జిల్లా కేంద్ర లాబరేటరికి పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారానికి మించి దగ్గు ,దగ్గినప్పుడు కళ్ళే పడటం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం రాత్రిపూట జ్వరం రావడం,ఆకలి ముందగించడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేసి. స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేపించుకోవాలనీ తెలియజేశారు. క్షయ వ్యాధి సోకిన వారు 6 నెలల మందులు వాడటం ద్వారా పూర్తిగా నయమవుతుంది దీనినీ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మరణించవచ్చు. ముందు జాగ్రత్తగా ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ వ్యాధి శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది.. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, బిపి షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు,వృద్ధుల కు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది కాబట్టి పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని ప్రస్తుతం 12 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ జయమ్మ , టీబి సూపర్వైజర్ సుభాషిని, టీబీ నోడల్ పర్సన్ లింగం రామకృష్ణ, జిల్లా టీబీ కోఆర్డినేటర్ బడుగు ప్రసాద్, డి ఈ ఓ మాధవ్
ల్యాబ్ టెక్నీషియన్ ఫణిందర్, ఏఎన్ఎంలు,బి పద్మ ,కె పద్మ, ఆశ వర్కర్లు రమణ,జ్యోతి, లక్ష్మి, నాగమ్మ విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.