జారిచేసిన జివో నెంబరు51 ను తక్షణమేరద్దు చేయాలి!!
అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్ జనం న్యూస్ జూలై 4 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ)అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఎరియాలో హైడ్రో పవర్ ప్లాంట్లుకు నిర్మాణానికి ప్రభుత్వ ఇచ్చిన జీవో నెంబరు 51ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆనంతగిరి జడ్పిటిసి దీసరి.గంగరాజు, అనకాపల్లి జిల్లాసిపిఎం జిల్లాకార్యదర్శివర్గసభ్యులు డి.వెంకన్న సిపిఎం అనంతగిరిమండల నాయకుడు ఎస్ నాగులు తదితరులు. బుధవారం,పెదకోట,ప్రాంతంలో హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని స్థానిక గిరిజనులతో కలిసి పరిశీలించి జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అనంతరం,జివో 51 కాపీని దగ్ధం చేసారు,కేబినెట్ నిర్ణయం తీసు కోవడాన్ని 51జి.ఓ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఇ.డి.సి.ఎ.పి) ద్వారా పెదకోట ఎరియాలో 800 మేగవాట్లు ఉన్న దాన్ని 1800 మేగవాట్లుకు,పెంచడం పై అగ్రహారం వ్యక్తం చేశారు. పెదకోట ఎరియా రేగులపాలెం,ప్రాంతంలోని రైవాడ చింతలపూడి మారిక మద్య లో 900 సామర్థ్యంతో లిప్టడ్ పంప్ట్ డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టులకు 2019 నుండి 2025 మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు అను మతులు మంజూరు చేసాయని తెలిపారు.ఏజెన్సీ,ప్రాంతాలలో!!రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీలను, ఇతర పేదలను వారి ఆవాసాల నుంచి వెళ్ల గొట్టేందుకు తీవ్ర మైన ప్రయత్నం చేయడం దారుణ మన్నారు, పెదకోట ఎరియాలో అత్యదిక గ్రామాలను ఖాళీ చేయించే పని అదానినీ మనుషులు పూనుకున్నారని తెలిపారు,దీన్ని ఓక ప్రక్కనుండి గిరిజనులు ప్రతిఘటిస్తున్నారని తెలిపారు, గిరిజనులు పోరాటాలను వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా!! రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అమోదం ఇవ్వడం జివో నెంబరు 51 ను విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పెదకోట ఎరియా లో 1,800 మేగవాట్లుకు సామర్థ్యంతో అనుమతులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు,ఈ ప్రాంతంలోని అదాని మనుషులకు గిరిజనులకు ఘర్షణ జరిగే ప్రమాదం ఉందని దీనికి ప్రభుత్వమే పూర్తి బాద్యత వహించ వలసి ఉంటుందని తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో టోకురు పంచాయితీ చిట్టంపాడు హైడ్రో పవర్ ప్రోజెక్ట్,గుమ్మకోట పంచాయితీ గుజ్జెలి హైడ్రో పవర్ ప్రోజెక్ట్ సర్వే చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసి సర్వేలకు సిద్దం అవుతున్నారు.కావున దీన్ని కచ్చితంగా అడ్డు కొంటమన్ని హెచ్చరిస్తున్నాము. విజయనగరం జిల్లా వేపాడ మండలం,మారిక దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శారదా నదిపైన ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం రైవాడ ఆయకట్టు రైతులకు విశాఖ ప్రజల త్రాగు నీటి అవసారాలుకు తీవ్రమైన విఘోతం కలిగిస్తుందని!! ఆగ్రహాం వ్వక్తం చేసారు, మరోవైపు గ్రామసభ 1/70 చట్టం, పీ.సా.చట్టం అటవీ హక్కులు చట్టాన్ని, ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో వర్తించే వివిధ రాజ్యాంగ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తూ ఈ ప్రాజెక్టులకు అనుమతించిన తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు నియమాలు (పెసా), అటవీ హక్కుల చట్టం (ఎఫ్.ఆర్.ఏ) ఉన్నాయని అన్నారు.ముఖ్యంగా పీసా చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఏదైనా భూసే కరణకు ముందు, ప్రభుత్వం వివరణాత్మక ప్రాజెక్ట్ సమాచారాన్ని మండల ప్రజా పరిషత్‌కి సమర్పించాలి.ఈ సమాచారంలో సమగ్ర ప్రాజెక్ట్ రూపు రేఖలు,సామాజిక ప్రభావాలు, భూసేకరణ ప్రత్యేకతలు,కొత్త స్థిర నివాసుల గురించి సమాచారం,వారి తెగలపై సామాజిక ప్రభావం,ప్రభావిత వర్గాలకు ప్రతి పాదిత పరిహారం వంటివి ఉండాలని తెలిపారు. అప్పుడు ఎంపిపి చట్ట బద్ధంగా ప్రభావిత గ్రామ పంచాయతీ, గ్రామ సభలతో సంప్రదించి వారి అంచనాలు, సిఫార్సులను సేకరించాలి.ఈసంప్రదింపుల తర్వాత, ఎం.పి.పి ఈ సిఫార్సులను ఏకీకృతం చేసి, భూసేకరణ అధికారికి తుది సిఫార్సును సమర్పించాలి.వారు ఈ సిఫార్సులకు కట్టుబడి ఉండాలని తెలిపారు. లేదా తేడా చేస్తే వివరణాత్మక రాతపూర్వక సమాధానం అందించాలి. ఎఫ్.ఆర్.ఏ లోని సెక్షన్ 6, వ్యక్తిగత, కమ్యూనిటీ అటవీ హక్కులను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించడానికి, పర్య వేక్షించడానికి గ్రామసభను ప్రాథమిక అధికారంగా స్పష్టంగా పేర్కొంటుంది. అటవీ భూమిని లేదా అటవీ నివాసుల హక్కులను ప్రభావితం చేసే ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభం నుండే గ్రామసభ పాల్గొనాలని అన్నారు ఎఫ్.ఆర్.ఏ నిర్దే శిస్తుంది. అంతే కాకుండా, ఎఫ్.ఆర్.ఏ లోని సెక్షన్ 4(డి) కమ్యూనిటీ అటవీ వనరులను నియంత్రించడానికి, వన్యప్రాణులు-జీవ వైవిధ్య రక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామసభ అధికారాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు ఆదివాసీ తెగలు, కంపెనీలైన వాటాదారులు ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్దేశిస్తుంది.ఈ సంప్రదింపుల ప్రక్రియను పూర్తిగా దాట వేశారని తెలిపారు.ఈ పి.ఎస్.పి లకు సంబంధించి, ఎటువంటి సమాచారం అందించబడ లేదన్నారు.దీనిపై ఇప్పటివరకు ఎటువంటి చర్చ జరగలేదన్నారు.పార దర్శకత లేదని తెలిపారు ఈప్రాంతాల్లోని ఆదివాసీలకు ఉద్దేశ పూర్వకంగా దీన్ని గోప్యంగా ఇన్నేళ్లు ఉంచి. ఆదివాసీ తెగల నుండి సంప్రదింపులు,సమ్మతి లేకపోక పోయిన,షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమిని లీజుకు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ భూ బదిలీ నియంత్రణ (ఎల్.టి.ఆర్) చట్టం ద్వారా నిషేధం.షెడ్యూల్డ్ ప్రాంతాలలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టులను చేపట్ట లేవని సుప్రీంకోర్టు 1997 సమతా కేసులో పేర్కొంది. అంతే కాకుండా, ఇది చట్టబద్ధమైన అవసరం అయినప్పటికీ, గిరిజన సలహా మండలి (టి.ఎ.సి)లో ఈ ప్రాజెక్టులపై చర్చ, ముందస్తు సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. ఇప్పటికీ టి.ఎ.సి ని నియ మించలేదన్నారు.ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వల్ల కలిగే భారీ స్థాన భ్రమనం గురించి, ఆదివాసీ తెగ వర్గాల జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉందన్నారు.A భూసేకరణ సమస్యకు మించి,స్థానిక నీటి వనరులపై ప్రాజెక్టులు ఆధార పడటం వలన నీటి భద్రత గురించి, ఈ వనరులపై ఆధారపడిన ఆదివాసీ తెగలు, దిగువ రైవాడ లాంటి బారి ప్రాజెక్టు క్రిందన ఉన్న వేలాది ఎకారాలు ఆయకట్టు రైతులపై దాని సామాజిక ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతాయని!!విటిని నిలుపుదల చేయకపోతే బావితరాలకు తీవ్రమైన ప్రమాదం ఎర్పడుతుందని తెలిపారు,చింతలపూడి మారిక మద్య లో అదాని గ్రూపు సంస్థలు మారిక చింతలపూడి గ్రామాలను కాలిచెయించే ప్రయత్నం ముమ్మరం చేశాయని దీన్ని మారిక గ్రామప్రజు సామాజిక ఆర్దిక సర్వే ను అడ్డు కున్నారని వారి స్పూర్తితో రైవాడ ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని లెదంటె రైవాడ ఆయకట్టు భూములు పూర్తిగా బీడు బారి పోతాయని తెలిపారు,వెంటనే జిఓ నెంబర్ 51 ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.ఈకార్యక్రమంలో!!పెదకోట ఎంపిటిసి శిరగం. శ్రావణి,సోముల చిన ఎర్రయ్య,సోముల దేముడు* నారాంగి సింహచలం(పీసా) గోల్లూరి అనంద్( పీసా) సప్పి దేముడు,గల్లూరి గోవిందు గుంటా గోవిందు జన్ని ఈశ్వరావు జన్ని వెంకటరావు గిరిజన సంఘం నాయకులు నరాజీ సురేష్‌బాబు,కె.భాస్కర్ అదికసంఖ్యలో గిరిజనులు పల్గోన్నారు,