జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరం, పూల్ భాగ్ రోడ్డు లో గల జగన్నాథ ఫంక్షన్ హాల్ నందు విజయనగరం జిల్లా పరిషత్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి ఆధ్వర్యంలో గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమంలో కీర్తి శేషులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో తొలిసారిగా పాల్గొన్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.