జనం న్యూస్, జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన ఆణివిళ్ళ వెంకటరమణ సేవా ట్రస్టు పేరిట ఆణివిళ్ళ ఫణికాంత్శాస్త్రి ఆధ్వర్యంలో గురువారం కాట్రేనికోన మెయి న్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బోధనా సామగ్రి పంపిణీ చేశారు. తమ నాయనమ్మ వెంకటరమణ 89వ జయంతి సందర్భంగా అమలాపురం హరిమనోవికాస కేంద్రం దివ్యాంగులకు, వృద్ధాశ్ర మంలో అన్నసమారాధన చేశామన్నారు. స్థానిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేసినట్టు ఫణికాంత్శాస్త్రి తెలిపారు.