జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం నేరేడుపల్లి గ్రామంలో మురళీకృష్ణ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగ జమున, శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేయగా వివిధ రకాల కంపెనీలకు చెందిన బయో మందులను గుర్తించి ఇట్టి బయోమందులకు ఎటువంటి అనుమతి లేదు పైగా అనుమతి పొందిన స్థలంలో పొరపాటున కూడా వీటిని నిలువ చేయరాదు అమ్మరాదు అని తెలిపారు.ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అధికారులు వీటిని సీజ్ చేశారు.వీటి యొక్క విలువ రూపాయలు 19,410/- రూపాయలు గుర్తించారు రైతులకు మండల వ్యవసాయ అధికారి ముఖ్య గమనిక బయోమందుల వల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉంది, ఈ విషయమై రైతులకు ఎన్నో మార్లు అవగాహన సదస్సులు కూడా నిర్వహించామన్నారు. డీలర్లకు కూడా అనేకమార్లు హెచ్చరికలు జారీ చేశాము .కాబట్టి రైతులు పొరపాటున కూడా బయో మందులు వాడరాదు, డీలర్లు కూడా ఇకమీదట అమ్మటానికి కూడా వీలులేదని మండల వ్యవసాయ అధికారి తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ఆర్ సతీష్ లక్ష్మణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….