జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సభకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. ఈ మేరకు బుచ్చిరెడ్డి పార్టీ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలను తీసుకెళ్లి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం వారికి దిశా నిర్దేశం చేయనున్నారని బుచ్చిరెడ్డి తెలిపారు. సభకు తరలిన వారిలో చిదం రవి, వైనాల కుమారస్వామి, నిమ్మల రమేష్, హింగే భాస్కర్, శానం కుమారస్వామి, లడే రాజ్ కుమార్, మిట్టపల్లి సతీష్, మారపల్లి వరదరాజు, మసికే కుమార్, మామిడిపల్లి సాంబయ్య, మాడిశెట్టి చిరంజీవి, సుధాకర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు….