జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని బతికేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు పోషక పదార్థాలతో కూడిన భోజనాన్ని అందించాలని ఆహార పదార్థాలలో నాణ్యతలోపించకూడదని పలు సూచనలు చేశారు.అలాగే మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. మండల పరిధిలోని ఏడు మోటలపల్లి గ్రామంలోని లంబాడీ తాండ లో గల ఎంపీపీస్ ప్రభుత్వ స్కూల్లో మండల పంచాయతీ అధికారి మహేందర్ సందర్శించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు.