జనం న్యూస్ జూలై 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు విలీన గ్రామం కొండ కొప్పాక గ్రామంలో మంచినీటి ఎద్దడ నివారణకు లక్ష రూపాయలతో బోర్ వెల్ నిర్మాణానికి ఈరోజు ఉదయం ఇంజనీరింగ్ అధికారులు కూటమి నాయకులు సమక్షంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్పొరేటర్ చిన్నతల్లి చేశారు. 84 ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నియోజకవర్గం ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ సహకారంతో జీవీఎంసీ నిధులతో ప్రజల అభ్యర్థన మేరకు ఈ బోరు నిర్మాణంతో సమస్య పరిష్కారం అవుతుందని నీలబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాయకులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు.//