జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముఖ్య అతిధిలు గా ఆర్ఎస్ఎస్ ఎస్ ఆర్ కె ప్రతాప్ రాజు
కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామాల్లో బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో
విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ ఎస్ ఆర్ కె ప్రతాప్ రాజు పాల్గొని ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం బిజెపి కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అని, ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు మట్ట సూరిబాబు సెక్రటరీ కొత్తలంక సురేష్ గుబ్బల భైరవ మూర్తి కొవ్వూరు సత్యనారాయణ రాజు కొవ్వూరి వెంకట నరసింహారాజు ఇందుకూరు సూర్యనారాయణ రాజు అల్లూరి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.