జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 4 రిపోర్టర్ సలికినీడి నాగు
స్థానిక సంస్థల బలోపేతం అంశం పై జాతీయ స్థాయి సమావేశాలలోమాట్లాడుతున్న చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫాని
చిలకలూరిపేట : హర్యానాలోని, గురుగ్రామ్ లో భారత పార్లమెంటు హర్యానా ప్రభుత్వ సహకారంతో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థల చైర్మన్ లతో"రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర" అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఆ సమావేశాలలో పాల్గొన్న చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కి అరుదైన గౌరవం దక్కింది ఈ సమావేశాలలో స్థానిక సంస్థల బలోపేతం అంశం పై ఆయనకు మాట్లాడేందుకు హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వేదిక అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా చైర్మన్ రఫాని మాట్లాడుతూ పట్టణ గ్రామ పంచాయతీలు మౌలిక వసతులు సదుపాయాల కల్పనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపేందుకు చొరవ చూపాలని..ముఖ్యంగా ప్రజా ప్రయోజనార్ధం చేసే తీర్మానాలను 2,3,సంవత్సరాలు కాలయాపన కాకుండా ప్రతి ఏటా పెట్టే వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టే నాటికి నిర్ణయాలు ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే స్థానిక సంస్థల బలోపేతం మార్గం సుగమం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అంతే కాకుండా పట్టణాలు,మేజర్ పంచాయతీలు, వేగంగా అభివృధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా.ఉపాధి పారిశ్రామికరుణ కల్పనకు ఆయా మున్సిపాలిటీల మీద ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సభ దృష్టికి తెచ్చారు.అదే విధముగా గ్రామపంచాయతీలు, కావచ్చు,మేజర్ పంచాయతీలు కావచ్చు,పట్టణాలుగ అభివృద్ధి పరిచే విధానంలో ప్రజారోగ్యం, ప్రణాళిక విభాగానిధి ముఖ్యమైన పాత్ర పోషించవలసివుంది.అందులో పట్టణ ప్రణాళిక విభాగాలు , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తగినట్లుగా పని తీరు లేదని ,స్థానిక సంస్థల ప్రతీ నిధుల సూచికలను ఏ మాత్రం పాటించని విధముగా పట్టణ ప్రణాళిక విభాగాలు ఉంటున్నాయని. పట్టణ ప్రణాళిక విభాగాలు విధులు నిర్వహణ విధానాలను పున సమీక్ష చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అనంతరం చిలకలూరిపేట మున్సిపాలిటీ సంబంధించిన పలు అంశాలను. ఫైల్ రూపంలో కేంద్ర మంత్రులకు అందజేసినట్లు తెలిపారు.