జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం పెదమడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సుధామయి విజయదుర్గ అమ్మవారి కి సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగము పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మాతృమూర్తులు గ్రామస్తులు అమ్మవారికి ఆషాడ మాసం సారె ఘనంగా సమర్పించడం జరిగినది ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము పూర్తి చేసి శాఖంబరిగా అలంకరణ చేసి మాతృమూర్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన చనిమిడి పానకాలు వివిధ రకాల స్వీట్లు పండ్లు పసుపు కుంకుమ అమ్మవారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తదుపరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు సుధామయి దంపతులు సానబోయిన రాంబాబు భాగ్యలక్ష్మి దంపతులు గుత్తుల వెంకటేశ్వరరావు దంతులూరి రామచంద్రరాజు మేడిశెట్టి వెంకటేశ్వరరావు పాటి వీరన్న బాబు జంపన చిట్టి కామరాజు గుబ్బల శ్రీను సానబోయిన వెంకటరమణ పేరాబత్తుల రామకృష్ణారావు సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ కనకారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.