జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ తన సిబ్బందితో శుక్రవారం రోజున పెట్రోలింగ్ నిర్వహించగా మండలం లోని నేరేడు పల్లి గ్రామ చెందిన ముక్క సుదర్శన్ తండ్రి జనార్ధన్ కిరణం షాప్ లో ప్రభుత్వం నిషేధించిన అంబర్ గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం మేరకు వెంటనే సుదర్శన్ కిరణం షాప్ ను తనిఖీ నిర్వహించగా అక్కడ అంబర్ గుట్కా ప్యాకెట్లు లభించాయి వాటి. విలువ సుమారు 2282/_ఉంటుందని తెలిపారు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన అంబర్ గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవు అని తెలియజేశారు….