జనం న్యూస్ జులై 5 వికారాబాద్ జిల్లా రిపోర్టర్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం లో కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్, అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి వై గీత, ఏ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, అనేక పోరాటాలతో,త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను సాధించుకుంటే ప్రభుత్వం వాటిని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చే కుట్రలకు ఒడిగట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కరోనా సమయంలో పార్లమెంటులో 29 కార్మిక చట్టాలను 4 కోడ్స్ గా బిల్లు ఆమోదం తెలపబడిందని ఇప్పటివరకు కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది అంటే అది కేవలం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యతతో ఉన్నారనే భావనతో మాత్రమేనని ఇట్టి కార్మిక వ్యతిరేక విధానాలైన 4 కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యతను చాటడానికి జూలై 9 న జరగబోయే ఒక్కరోజు సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని లేక పోతే 12 గంటల పని దినంతో పాటు కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఈ 4 కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పాత కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం సమ్మె విజయవంతం చేయాలని కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘాo, DYFI, CITU, AITU, IFTU KVPS, వ్యకస సంఘాల నాయకులు సుదర్శన్, సతీష్ కుమార్, నవీన్ కుమార్, లక్ష్మయ్య, లక్ష్మీ, ఎలామ్మ, అనిల్ శ్రీనివాస్ గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.