జనం న్యూస్ జులై 5 ఇంకా పల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పాడేరు నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలు నియోజవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈరోజు ఉదయం పరిశీలకులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని కమిటీ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పార్టీ నాయకులు దృష్టికి తీసుకువెళ్లాలని నిజమైన లబ్ధిదారులు గుర్తించి వారికి న్యాయం చేయాలని, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు తిప్పుకొట్టాలని, వైసీపీ నాయకులతో అంట కాకూడదని, అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని, కీర్తిశేషులు ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ సూచనలు సలహాలు తీసుకోవాలని పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలని కమిటీ సభ్యులు నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకొని అందరూ మన్నలు పొందే విధంగా పనిచేయాలని, ఎన్నికైన కమిటీ సభ్యులు చేత నాగ జగదీష్ ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షులుగా వర్తన నీలకంఠం ప్రధాన కార్యదర్శిగా వర్తన వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నియోజవర్గ ఇన్చార్జ్ శ గిడ్డిఈశ్వరి మాట్లాడుతూ పార్టీ మీపై నమ్మకంతో కార్యకర్తలు నాయకులు ఎన్నుకున్నారని, మీరు బాధ్యతగా పనిచేయాలని, పార్టీ కార్యక్రమాలను అందర్నీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఎన్నికైన సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మణి కుమారి కిల్లి శంకర్ నాయుడు వియ్యపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.