జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: మండలం లోని
హరిపాలెం-అందలాపల్లి లో వెలసి ఉన్న శ్రీ పద్మావతి, అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 18వ వార్షికోత్సవం సంధర్బంగా "సమరసతా సేవా ఫౌండేషన్"ఎలమంచిలి సబ్ డివిజన్ సభ్యులు బివి రమణ,కొల్లి అప్పారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుండి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్నసమరాధన ఏర్పాటు చేశారు.సాయంత్రం 5 గంటల నుండి శ్రీ భగీరథమ్మ కోలాటం బృందం వారిచే కోలాటం భజనలతో స్వామివారి ఊరేగింపు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేవా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.