జనం న్యూస్ తర్లుపాడు మండలం. జనవరి 25:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు తహసీల్దార్ యూ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామం లో ర్యాలీ నిర్వహించి భారత పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛా, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మరియు మరియు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మరియు మతం, జాతి, కులం, కమ్యూనిటీ, భాష లేదా ఏదైనా ప్రేరేపణల ప్రభావానికి లోనుకాకుండా ఓటు వేయండి అని తహసీల్దార్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, వెల్ఫేర్ సుధీర్, మహిళ పోలీస్ మాధవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భవాని, వి ఆర్ ఏ చల్లగాలి చెన్నయ్య, షేక్ రసూల్, నెహ్రు యూత్ అధ్యక్షులు పుల్లయ్య పాల్గొన్నారు