జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రపంచ జూనోటిక్ దినోత్సవం సందర్భంగా నగరంలోని బహుళార్థ పశు వైద్య కళాశాలలో జూనోటిక్ వ్యాధులపై ఆదివారం అవగాహన కల్పించారు. జేడీ వైవీ రమణ మాట్లాడుతూ… పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు 70శాతం వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. జంతు ప్రేమికులు, యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం 584 పెంపుడు కుక్కలు, పిల్లులకు ర్యాబిస్ వ్యాధి టీకాలు వేశామని తెలిపారు.