జనం న్యూస్ జులై 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అలాగే డివిజన్ లోని బిజెపి సంస్థాగత విషయాలపై బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు పులిగోళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నందు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు, డివిజన్ లోని కాలనీ అధ్యక్షులు బస్తీ కమిటీ అధ్యక్షులు రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ సరిగ్గ లేదని, నూతన కమిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని, కొత్త బోర్వెల్ వేయించి నీటి సమస్య తీర్చాలని, స్మశాన వాటికల అభివృద్ధి చేయాలని ఇలా పలు సమస్యలను వడ్డేపల్లి రాజేశ్వరరావు కి తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలియజేశారు, తదనంతరం డివిజన్ లోని నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేయాలని రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అన్నిటిని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విజయ్, డివిజన్ నాయకులు వెంకటరామిరెడ్డి,మోహన్ గౌడ్,శర్మ,శ్రావణ్, అంకిత్ సింగ్ స్థానిక ప్రజలు,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.