బిచ్కుంద జులై 7 జనం న్యూస్
రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బిచ్కుంద పర్యటన సందర్బంగా బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో లేని శ్రద్ద అరెస్ట్ చేయడంలో ఉంది.మీరిచ్చిన దొంగ హామీలు అమలు చేసేవరకు బీజేపీ పార్టీ పోరాడుతుంది. హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు కచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తు, నిలదీస్తూ, అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. జనరల్ సెక్రెటరీలు జాదోవ్ పండరి ముత్యం పీరాజీ, ఉపాధ్యక్షులు కమ్మరి గంగాధర్, గణపతి, అడికే రాజు పటేల్, మొగులుగొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లు దేశాయ్, ధన్నూర్, విట్టల్, బుడల గంగరాజ్, తదితరులను ముందస్తు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేయడం జరిగింది.