జనం న్యూస్ జులై 7
శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ నగరంలోని అదాలత్ వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వర్షం కారణంగా బడులంతా బురద గుంటలుగా మారాయని విమర్శించారు వెంటనే వర్షం వలన అయినా బురద గుంటలను మట్టితో చదును చేయించాలని అన్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఛార్జీలను పెంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ నాయకులు సందీప్ మహేష్ తదితరులు పాల్గొన్నారు…